NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 11:16 am Posted by : NAMASTHE BHARAT

ప్రజాసేవతో పాటు దైవసేవలోనూ ముందంజలో వై. రవీందర్ యాదవ్

*ప్రజాసేవతో పాటు దైవసేవలోనూ ముందంజలో వై. రవీందర్ యాదవ్*

*అక్కివేనిగూడ హనుమాన్ దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేత*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్11:కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్కివేనిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్ యాదవ్ రూ.30,116 నగదు విరాళాన్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి సూచనలు, ఆశీస్సులతో దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహకారంగా ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వై. రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలు మరియు ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ దేవాలయం భక్తులకు ఒక పవిత్ర క్షేత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ విరాళం అందజేసినందుకు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.