NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 5:36 pm Posted by : NAMASTHE BHARAT

పీపీఎల్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా ఐనాల పరశురాములు నియామకం

పీపీఎల్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా ఐనాల పరశురాములు నియామకం

నమస్తే భారత్ :-మరిపెడ

ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఐనాల పరశురాములు ను స్వెరోస్ సంస్థ చీఫ్ ,సుప్రీమ్ స్వెరో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ (విఆర్ఎస్) ఆదేశానుసారం నియమించినట్లు పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నర్సయ్య తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐనాల పరశురాములు గతంలో మరిపెడ గురుకుల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా, సుమారు ఐదు సార్లు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గా, జిల్లా చైర్మన్ గా, భద్రాద్రి కొత్తగూడెం జోన్ కార్యదర్శి గా పనిచేసి నిరంతరం గురుకుల విద్యార్థిని, విద్యార్థుల అభివృద్ధికి, ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తు కోసం అప్పటి గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ మార్గదర్శకంలో పనిచేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సందర్భంగా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా నియమించినట్లు తెలిపారు.విద్యారంగ సమస్యల పరిష్కారం,విద్యార్థుల అభివృద్ధికి, ఎదుగుదలకు కృషి చేస్తా.. పీపీఎల్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు.నాపై నమ్మకంతో నన్ను పీపీఎల్ తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ గా నియమించినందుకు సుప్రీమ్ స్వెరో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ (అడిషనల్ డీజీపీ (విఆర్ఎస్) కి ప్రత్యేక కృతజ్ఞతలు, మరియు పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నర్సయ్య కి, సీనియర్ ఎస్ఆర్పీ చాతల్ల సదానందం కి, రాష్ట్ర కమిటీకి, సిఆర్ఓ లకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు