పాలమూరులో బాలలహరి కరోకే పోటీల్లో షాద్‌నగర్ స్వరరాగ సంగీత సుధా మ్యూజిక్ అకాడమీ విద్యార్థుల గాన ప్రతిభ

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్11:పాలమూరు పట్టణంలోని పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన బాలలహరి కరోకే ప్రోగ్రాం ఘన విజయాన్ని సాధించింది. చిన్నారుల్లో సంగీతాభిరుచిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది బాలబాలికలు పాల్గొని తమ గాన ప్రతిభను ప్రదర్శించారు.కార్యక్రమానికి హాజరైన స్వరాలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షులు నాయిని భాగన్న గౌడ్, డా. మేకల శ్రీనివాసులు, డీకే ఆంజనేయులు మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన...