NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 3:45 pm Posted by : NAMASTHE BHARAT

నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర కిరాణా అండ్ కూల్ డ్రింక్స్ షాప్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించిన  కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి 

నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర కిరాణా అండ్ కూల్ డ్రింక్స్ షాప్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించిన 

కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి 

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో మరిపెడ గ్రామానికి చెందిన భాషిపంగు రవికాంత్, భాషిపంగు సునీల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర కిరాణా అండ్ కూల్ డ్రింక్స్ షాప్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి హాజరై షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యాపార రంగంలో అడుగుపెట్టిన రవికాంత్, సునీల్‌లు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, మెరుగైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని సూచించారు.అనంతరం షాప్ నిర్వాహకులు ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానుగోత్ రాంలాల్, పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు కుడితి వెంకట్ రెడ్డి, అప్సర్, కౌన్సిలర్ జాటోత్ సురేష్, వెర్మరెడ్డి వెంకట్ రెడ్డి, ముదిరెడ్డి లక్ష్మారెడ్డి, గుండగాని వెంకన్న, మెంచు అశోక్ కుమార్, బోడ రమేష్, బానోత్ చిన్నా, బాధావత్ రవి, బోడ రవి, బాధావత్ సైదులు, ఏడేళ్లి సైదులు, సందీప్, రంజిత్ కుమార్, బాలకృష్ణ, శ్రీకాంత్, శివ, అశోక్, గంధం వీరన్నతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొని నూతన వ్యాపార సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.