NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 12:09 pm Posted by : NAMASTHE BHARAT

దాహార్తిని తీర్చండి.. నీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోండి

దాహార్తిని తీర్చండి.. నీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోండి

 

అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశాలు

రామకృష్ణ నగర్, బాల్‌రెడ్డి నగర్‌లో ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటన

మురుగునీరు కలవడంతో తాగునీటి కోసం ప్రజల అవస్థలు

లో ప్రెజర్ కారణంగా చివరి ఇంటి వరకు చేరని నీటి సరఫరా

పెండింగ్ సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి హామీ

కుత్బుల్లాపూర్, జూన్ 15 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ప్రస్తుతం నెలకొన్న నీటి కొరతను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం 131వ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్, బాల్‌రెడ్డి నగర్ కాలనీల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ నగర్ వాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల నీటిని వినియోగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సరఫరా కూడా తక్కువ ఒత్తిడితో జరుగుతుండటంతో అవసరమైన మేర నీరు అందడం లేదని వాపోయారు. దీంతో తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు. అదేవిధంగా బాల్‌రెడ్డి నగర్ కాలనీవాసులు కూడా లో ప్రెజర్ కారణంగా తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని, పార్కు సమీపంలో ఉన్న విద్యుత్ వైర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు.

ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి కాలంలో తాగునీటి కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరగడం వల్ల కాలనీల్లోని చివరి ఇంటి వరకు నీరు చేరడం లేదని పేర్కొన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఈఈ భద్రు, వాటర్ వర్క్స్ డీజీఎం ప్రసాద్‌రావు, ఏఈ గోపాలకృష్ణ, ఎలక్ట్రికల్ అధికారి రవీందర్‌రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్, మాజీ కౌన్సిలర్లు కిషన్‌రావు, సూర్యప్రభ, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.