NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 10:14 pm Posted by : NAMASTHE BHARAT

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి

*తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి*

*ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ,తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి*

*తెలంగాణ ఉద్యమ కారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి*

*పిడమర్తి రవి ని సన్మానించిన వెంకట్ రాంరెడ్డి ,కౌన్సిలర్ దిలీప్ కుమార్, విద్యార్థి నేత జాంగారి రవి*

*షాద్ నగర్ లో ఫ్రొఫెసర్ జయ శంకర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కర పత్రాన్ని స్థానిక ఉద్య మ కారుల తో కలిసి విడుదల చేసిన పిడమర్తి రవి*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్10:జూన్ 21న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాన్ని స్థానిక ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఈరోజు షాద్ నగర్ బ్లాక్ ఆఫీస్ ముందు ఫ్రొఫెసర్ జయ శంకర్ గారి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళి అర్పించి జయశంకర్ విగ్రహం ముందు విడుదల చేసిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇటి స్థలం పింఛన్ గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో జూన్ 21న ఇందిరాపార్క్ హైదరాబాదులో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శతాబ్ద కాలంలో అతిపెద్ద ఉద్యమం జరిగింది అంటే అది కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మాత్రమే, అంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ ఉద్యమ వీరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.
తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం ప్రాణాలు తిరిగించి ఉద్యమించిన ఉద్యమకారులందరినీ గౌరవించుకోవడానికి తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తున్నాం. గత BRS ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కలేదు ఏదో కొంతమందికి చిన్న చిన్న పదవులు ఇచ్చిన ముఖం చాటేశారు తప్ప తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విద్యార్థి ఉద్యమ నాయకులకు కార్మికులకు తగిన ఫలాలు దక్కలేదు అలాంటి సందర్భంలో ప్రజా ప్రభుత్వం పాలనలోకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను గుర్తించాలని కేశవరావు గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి గుర్తింపు చర్యలు చేపట్టడం జరిగింది ఈ చర్యను తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆహ్వానిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వేలాదిమంది ఉద్యమకారుల పైన పోలీసు కేసు కాకపోవడం వల్ల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అందరికీ ఉద్యమకారులకు ఇవ్వవలసిన దక్కవలసిన ఫలాలు దక్కకుండా పోతావేమో అనే అపోహములో అందరమూ ఉన్నాము,ఇలాంటి అపోహల ఉన్న సందర్భంలో ఉద్యమకారులు అంత సంఘటితమై వారి హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైనది. తెలంగాణ రాష్ట్ర కోసం వారి వారి స్థాయిలో ఉద్యమం చేసిన వారిని అందరిని గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన ఫలాలను అందించే బాధ్యత తెలంగాణ ఉద్యమకారుల సంఘంపై ఎంతైనా ఉంది అని అన్నారు

తెలంగాణ ఉద్యమకారుల ప్రధానమైన డిమాండ్స్

1) ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలి

2) ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలి.

3) ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి.

4) ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలి.
ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్తో అప్పటి తెలంగాణ విద్యార్థి ఉద్యమ రథసారథి విద్యార్థి జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో అనేక మంది మంత్రులకు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీడియా సమావేశాలు నిర్వహించి ఈ మూడు డిమాండ్లను చెప్పడం జరిగింది కావున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు రావలసిన ఈ న్యాయమైన వాట గురించి తమ గొంతులు వినిపించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసి, తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరిస్తున్న రాష్ట్ర పురావస్తు, సంస్కృతిక, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది జూన్ 21 2026 నాడు ఇందిరా పార్క్ లో వేలాదిమంది తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు,
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఇవ్వాలని అదేవిధంగా సంక్షేమ పథకాలను అందించాలని ప్రజా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో
మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తెలంగాణ ఉద్యమ కారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి వెంకట్ రాంరెడ్డి, కౌన్సిలర్ దిలీప్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ మాంగులాల్ నాయక్, విద్యార్థి నేత జాంగారి రవి, ఉద్యమ కారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మేకల వెంకటేష్, రవి కుమార్ గౌడ్,బి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెళ్ళి సురేష్, రహీమ్,నేతలు కుడుముల మల్లేష్, ప్రసాద్, సిందం విటలయ్య,శేఖర్ గౌడ్, సింగపాగ శివ, సమెల్,రామకృష్ణ, చింటు తదితరులు పాల్గొన్నారు.