NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 11:51 am Posted by : NAMASTHE BHARAT

ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలి

ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలి

కొంపల్లిలో బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన, శిక్షణ శిబిరం

బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచన

పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ స్థాయి ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లిలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన, శిక్షణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక సమగ్ర సవరణ పరిశీలకుడు, తెలంగాణ ఆహార సంస్థ చైర్మన్ ఫహీం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త ఏపీ మిథున్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలంటే ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు కావడంతో పాటు, తప్పుల సవరణ, మార్పులు, చేర్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా పార్టీకి బలమైన ఓటరు ఆధారాన్ని ఏర్పరచుకోవచ్చని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ ఉపాధ్యక్షుడు బొంగునూరి కిషోర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.