NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 10:02 pm Posted by : NAMASTHE BHARAT

ఎన్ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి

ఎన్ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి

ఎమ్మెల్యే రామచంద్రునాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

ఓటు హక్కు పరిరక్షణలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఎలు) కీలక పాత్ర పోషించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని భార్గవ ఫంక్షన్ హాల్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఎల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆకర్ల నర్సిరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, ఎండి అబజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అసలైన ఓటర్ల పేర్లు తొలగిస్తూ, డమ్మీ ఓట్లు నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. దేశ సంపదను కొందరు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మలచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమని తెలిపారు.బీఎల్ ఏలు సమన్వయంతో పనిచేసి ఎస్ఐ ఐఆర్ ప్రక్రియను సక్రమంగా పర్యవేక్షించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఓటరును గుర్తించి వారి హక్కును కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు