NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 3:09 pm Posted by : NAMASTHE BHARAT

ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలి

ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలి

ఆర్టీసీ డిపో మేనేజర్ సరస్వతి

నర్సంపేట జులై 13 (నమస్తే భారత్ ) :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డిపో మేనేజర్ మామిడాల సరస్వతి డిపో ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. నర్సంపేట డిపో అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం మరియు డిపో ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగస్తులను కోరారు. డిపో పురోగతికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగులకు వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ అమృత పాల్గొనగా, డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.