NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 11:17 am Posted by : NAMASTHE BHARAT

అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు రూ.4,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు రూ.4,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్

నమస్తే భారత్:-మరిపెడ

ప్రజా సమస్యల పరిష్కారానికి జూన్ 10న మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలి – సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్
సిపిఐ మహబూబాబాద్ జిల్లా సమితి పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జూన్ 10న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే భారీ ధర్నాను ప్రజలు, రైతులు, కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు రూ.4,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాజీలేకుండా అమలు చేసి అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని, పేదలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ అమలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ధీజిల్ రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి పథకాన్ని కొనసాగించాలని, ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.
ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న జూన్ 10 ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎండి అబ్దుల్ రషీద్ కోరారు.